Menu

Sandeep Vanga Vs Aamir: సెన్స్‌లెస్‌, లూజ్‌ టాక్‌.. సందీప్‌ రెడ్డి వంగా ఇది తగ్గించుకుంటే మంచిది!

Tri Ten B
Aamir Khan's Old Apology Video for Dil Song Goes Viral After Sandeep Reddy Vanga Used His Film to Attack Kiran Rao's Criticisms

ఈ ప్రపంచంలో ఎవరూ కూడా విమర్శకు అతీతులు కాదు.. నిజానికి విమర్శలు మంచివే.. అవి మనలో అభివృద్ధికి కారణమవుతాయి. అదే సమయంలో అహేతుకంగా ఉండే విమర్శలను తిప్పికొట్టడం కూడా ముఖ్యమే. కానీ విమర్శలను తిప్పికొట్టలేనప్పుడు చాలా మంది వ్యక్తిగత దూషణలకు దిగుతారు.. దిగజారి మాట్లాడుతారు. అర్థంలేని విధంగా నోటికి పని చెప్పి సైకోనందం పొందుతారు. ఆ కోవలోకే వస్తాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga). ఆయన చేసిన సినిమాలు మూడు.. అందులో ఒకటి రీమేకు. ఆ మూడిటిపైనా ఎవరూ ఏం మాట్లాడకూడదు. ఈ సినిమాలో నాకు ఇది నచ్చలేదు అంటే ఆయనకు కోపం వస్తుంది. విమర్శించిన వారిని పర్శనల్‌ అటాక్‌కు దిగుతాడు. అమీర్‌ ఖాన్‌(Aamir Khan) మాజీ భార్య కిరణ్ రావు(Kiran Rao)పై ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తే ఈ విషయం మరోసారి క్లియర్‌కట్‌గా అర్థమవుతుంది.


ఎందుకు భయ్యా ఇలాగా?

కబీర్‌సింగ్‌, బాహుబలి లాంటి సినిమాలు స్త్రీల పట్ల ద్వేషం, వేధింపులను ప్రోత్సహించేలా ఉన్నాయని.. ఇటీవలి రిలీజ్ అయిన యానిమల్‌ సినిమా కూడా అలానే ఉందని కామెంట్స్ చేశారు కిరణ్‌రావు. ఇక్కడ కిరణ్‌రావుకు విమర్శించే హక్కు ఉంది. ఆ విమర్శలను తిప్పికొట్టే రైట్‌ కూడా సందీప్‌ వంగాకు ఉంటుంది. అయితే ఇందుకు సందీప్ ఎంచుకున్న మార్గమే ఆయనలోని సంకుచిత మనస్తత్వాన్ని కళ్లకు కడుతోంది. అమీర్‌ ఖాన్‌ నటించిన ‘దిల్‌’ సినిమాలోని ఓ సీన్‌ ఆమెకు కనపడలేదా? అంటూ పర్శనల్‌కి పోయాడు సందీప్‌. ఇక్కడ ప్రత్యేకించి అమీర్‌ఖాన్‌ సినిమాను ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందో క్లియర్‌గా అర్థమవుతుంది.


ప్రేమలో పీహెచ్డీ చేశాడా?

సందీప్‌రెడ్డి ఇలా చేయడం ఇదేం తొలిసారి కాదు. గతంలో తన కబీర్‌సింగ్‌ సినిమాకు నెగిటివ్ రివ్యూ ఇచ్చిన రాజీవ్‌ మసంద్‌ని ఓ ఇంటర్వ్యూలో ఫ్యాట్‌ షేమింగ్‌ చేశాడు సందీప్‌. అంతే కాదు రివ్యూలు ఇచ్చేవారిని పారాసైట్స్‌తో పోల్చాడు. ఇలా తనకు ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా మన ఏపీ రాజకీయ నాయకుల్లాగా పర్శనల్‌కి పోతాడు ఈ డైరెక్టర్‌. ఇక సందీప్‌ లాజిక్కులు కూడా విడ్డూరంగా ఉంటాయి. కబీర్‌సింగ్‌ సినిమాలో హీరో హీరోయిన్‌ను చెంపదెబ్బ కొట్టడంపై విమర్శలు వచ్చాయి. పురుషంకారం అంటూ కొన్ని సీన్లను పలువురు తప్పుబట్టారు. సిట్యూవేషన్‌కి తగ్గట్టుగా ఆ సీన్‌ ఉందని చెప్పుకునే ప్రయత్నం చేస్తే సరిపోయేది కానీ.. ఈ విమర్శలను సందీప్‌రెడ్డి తిప్పికొట్టిన విధానం ఆయన ఇమెచ్యూర్డ్‌ మైండ్‌సెట్‌కి నిదర్శనం. బంధాల్లో, ప్రేమలో గొడవలు అవుతాయని చెప్పడం వేరు.. కొడితేనే ప్రేమ అని చెప్పడం వేరు. ఆయన దృష్టిలో ప్రేమకు చెంపదెబ్బ ఓ కోలమానం. మే బీ అది ఆయన దృష్టిలో కావొచ్చు.. కానీ అలా కొట్టకపోతే అసలు ప్రేమే కాదట. ఇలా కొట్టడాన్ని వ్యతిరేకించే వాళ్లకు ప్రేమంటే తెలియదట. ఈయనగారు ప్రేమలో పీఎచ్‌డీ చేశాడుగా… మనం వినాలి తప్పదు!

Also Read: ప్రశాంత్‌ వర్మది ఓవర్‌ కాన్ఫిడెన్సా? ప్యూర్‌ కాన్ఫిడెన్సా? వాళ్లమైనా పైనుంచి ఊడిపడ్డారా?


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *