‘Three Of Us…’ ఈ చిత్రాన్ని మనం ఓ సాధారణ సినిమాగా చూసి వదిలేయలేం. భావోద్వేగాల కూర్పుగా మనసులోకి తీసుకుంటాం. మనం కూడా మన బాల్యం లోకి ప్రయాణిస్తాం. ఆ చిన్నతనంలో మనతో చేయి పట్టుకుని నడిచిన స్నేహితులను తలచుకుంటాం. కేవలం జ్ఞాపకాలను నెమరవేసుకోవడమే కాదు.. వాటితో ముడిపడిన ఉద్వేగపు క్షణాలను వర్తమానంలోకి ఆహ్వానిస్తాం. మన ఊరి స్కూల్ బెంచ్ పైనో… వీధి చివరన చెట్టుకుందో..కడలి కెరటాల ఘోషలోనో ఆ చిన్నతనం చేసిన ఊసులను తెరలుతెరలుగా చూస్తాం.
Also Read: గంతలు కట్టుకున్న న్యాయదేవత ఏం తీర్పిస్తుంది? నెక్ట్స్ లెవల్‌కు వెళ్లిన మలయాళం సినిమా