అవినీతి నిర్మూలన అనే మాటలు నీటిపై రాతలే అని మళ్లీ రుజువు అవుతూనే ఉంది. భారతదేశంలో అవినీతి తగ్గాల్సింది పోయి ఇంకా పెరుగుతూ వస్తుంది.
ఠాగూర్ సినిమాలో చిరంజీవిలా తనకు అవినీతి అనే పదం నచ్చదు అన్నట్టు తమ పాలనలో అవినీతిని అంతమొందించామని ప్రధాని నరేంద్ర మోదీ అనేక సందర్భాల్లో ఉటంకించారు. కానీ వాస్తవం చూసుకుంటే మన వ్యవస్థలో అవినీతి పెరుగుతూ వస్తుంది. మరి ఎక్కడ అవినీతిని నిర్మూలించినట్టు?
దేశంలో పెరిగిన అవినీతి
1995 నుండి ట్రాన్స్ఫరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ ప్రతి సంవత్సరం ప్రపంచ దేశాల అవినీతి స్థాయిలను బట్టి ఇచ్చే అవినీతి అవగాహన సూచిక (corruption perceptions index) ప్రకారం భారతదేశంలో అవినీతి గతేడాదితో పోలిస్తే పెరిగింది. 2022 సంవత్సరంలో 40 స్కోర్ తో 85 ర్యాంక్ లో ఉంటే 2023 సంవత్సరానికి 39 స్కోర్ తో 93 ర్యాంక్ కి పడిపోయింది.
మూడింట రెండు వంతులకు పైగా దేశాలు 100కు 50 లోపు స్కోర్ తెచ్చుకున్నాయి. ఇది ఆయా దేశాల్లో ఉన్న తీవ్రమైన అవినీతి సమస్యల్ని సూచిస్తుంది.
39 స్కోర్ తో భారతదేశపు హెచ్చుతగ్గులు చాలా తక్కువ స్థాయిలో ముఖ్యమైన మార్పులపై ఎటువంటి స్థిరమైన ముగింపుని తీసుకోలేము. అయితే ఎన్నికలకు ముందు భారతదేశం పౌర సమాజాన్ని మరింత కుదించడానికి చూస్తుంది , ప్రాథమిక హక్కులకు తీవ్రః భంగం కలిగించే బిల్లును(టెలి కమ్యూనికేషన్ బిల్) ఆమోదిస్తుంది అని ఈ సంస్థ అభిప్రాయపడింది.
దేశంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ, 2030 కల్లా 10 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ చేరుకుంటాం అని బడాయిలకు పోయే అధికార పార్టీ నేతలు ఈ అవినీతి పెరుగుదల మీద మాత్రం ఎటువంటి దృష్టి ఉండదు.
అవినీతిపై పోరాటం అంటూ ఎన్నికల్లో వాగ్దానాలు
2014లో ఎన్నికల్లో అవినీతిని నిర్మూలిస్తాం భ్రష్టాచార్ విరోద్ భారత్ అని నినాదాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన బిజెపి- ఎన్డీఏ ప్రభుత్వం ప్రస్తుత అవినీతి సూచికపై మౌనం వహించింది. ప్రతిపక్ష పార్టీలన్నీ అవినీతిమయమయ్యాయని, అధికారంలోకి వచ్చిన ఈ పదేళ్లలో అవినీతిని ఎంతో తగ్గించామని వివిధ సభల్లో మాట్లాడిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వాస్తవ పరిస్థితిని మాత్రం గుర్తించలేకపోయారు. దేశంలో అవినీతి వల్లే డాలర్ తో రూపాయి విలువ పడిపోయిందని 2013లో నరేంద్ర మోదీ అన్నాడు. అప్పుడు రూపాయి విలువ ఒక డాలర్ తో 60 రూపాయలు.మరి ఇప్పుడు డాలర్ తో రూపాయి విలువ అత్యంత కనిష్టానికి 83 రూపాయలకు పడిపోయింది మరి దీనికి కూడా అవినీతినే కారణమా?
అవినీతిమయమైన ప్రతిపక్ష పార్టీలన్నీ ఒకటే అని చెప్పే మోదీ అదే పార్టీల నుండి తమ పార్టీలోకి చేరాక వారిపై ఎటువంటి విచారణలు ఉండవు. 28 రాష్ట్రాలకు గాను 17 రాష్ట్రాలు నేరుగా లేదా పొత్తుతో అధికారంలో ఉన్న బిజెపి ఉంది. ఇలాంటి పరిస్థితి ఉంటే మన దేశంలో అవినీతిని ఎలా నిర్మూలిస్తారో ప్రధానమంత్రి నే సమాధానం ఇవ్వాలి.
అతి తక్కువ అవినీతి,అత్యంత అవినీతి దేశాలు:
అవినీతి అవగాహన సూచిక 2023 ప్రకారం 90 స్కోర్ తో డెన్మార్క్ దేశం వరుసగా ఆరవ ఏడాది అతి తక్కువ అవినీతి కలిగిన దేశంగా ఉంది. ఫిన్లాండ్ రెండో స్థానం, న్యూజిలాండ్, నార్వే,సింగపూర్ మొదటి ఐదు దేశాలుగా ఉన్నాయి.
అత్యంత అవినీతి కలిగిన దేశాలలో సోమాలియా 11 స్కోర్ తో 180వ స్థానంలో ఉంది. వెనిజూయేలా, సిరియా,దక్షిణ సూడాన్, యెమెన్ దేశాలు దీని వెనుక ఉన్నాయి.
ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ ఈ సూచికను 4 పద్ధతుల్లో తయారుచేస్తుంది. 1. సమాచారం మూలాలను ఎంచుకోవడం, 2. సమాచారం మూలాలను 0-100 స్థాయిలో ప్రామాణికం చేయడం, 3. సగటును (average) లెక్కించడం, 4. అనిశ్చితుల కొలతను నివేదించడం.
ట్రాన్స్ఫరెన్సీ ఇంటర్నేషనల్ ప్రపంచ బ్యాంక్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం వంటి 12 సంస్థల నుండి వివరాలు సేకరించి ఈ సూచికను తయారు చేసింది.
Great job by content writer