Menu

ISRO: ఇస్రో నుంచి మరో అద్భుతం.. వాతావరణ ఉపగ్రహ ప్రయోగానికి సర్వం సిద్ధం!

Praja Dhwani Desk

ISRO Weather Mission: దేశంలోని అత్యాధునిక వాతావరణ ఉపగ్రహాన్ని ఇస్రో అతి త్వరలో ప్రయోగించబోతోంది. ఇన్సాట్-3డీఎస్ పేరుతో ఈ ఉపగ్రహాన్ని శ్రీహరికోటకు పంపారు. జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 14 రాకెట్ నుంచి ఈ ప్రయోగం జరగనుంది. ఇది వాతావరణానికి సంబంధించిన కచ్చితమైన సమాచారం, ముందస్తు అంచనాను ఇవ్వడానికి సహాయపడుతుంది. భూమి, సముద్రం, వాతావరణం, ఎమర్జెన్సీ సిగ్నల్ వ్యవస్థకు సంబంధించిన సమాచారాన్ని అందించడమే ఈ ఉపగ్రహం ముఖ్య ఉద్దేశమని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తెలిపింది. అలాగే, ప్రస్తుత ఇన్ శాట్ సిరీస్ ఉపగ్రహాల బలం, సామర్థ్యాన్ని పెంచాల్సి ఉంది. అంతేకాకుండా సహాయక చర్యల్లో కూడా ఇది తోడ్పడుతుంది.

 

వాతావరణానికి చెందిన సమాచారం కోసం:
ఇన్శాట్-3 సిరీస్ ఉపగ్రహంలో ఆరు రకాల భూస్థిర ఉపగ్రహాలు ఉన్నాయి. ఏడో ఉపగ్రహాన్ని వచ్చే నెలలో ప్రయోగించనున్నారు. అయితే దీని తేదీని ఇస్రో ఇంకా వెల్లడించలేదు. ఇన్ శాట్ శ్రేణికి చెందిన అన్ని ఉపగ్రహాలను 2000-2004 మధ్య ప్రయోగించారు. దీని వల్ల కమ్యూనికేషన్, టీవీ ప్రసారం, వాతావరణానికి సంబంధించిన సమాచారం అందుతోంది. ఈ ఉపగ్రహాల్లో 3ఏ, 3డి ప్రైమ్ ఉపగ్రహాలకు సమీపంలో ఆధునిక వాతావరణ పరికరాలు ఉన్నాయి. ఇవి భారత్‌తో ఆపటు చుట్టుపక్కల వాతావరణ మార్పుల గురించి కచ్చితమైన సమాచారాన్ని అందిస్తాయి. ఈ ఉపగ్రహాలు ప్రతి ఒక్కటి భారత్‌ దాని పరిసర ప్రాంతాలలో కమ్యూనికేషన్ టెక్నాలజీ, వాతావరణ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి సహాయపడ్డాయి.

బరువు 2275 కిలోలు:
ఈ ఉపగ్రహాలను భూమధ్యరేఖకు ఎగువన మోహరించడం ద్వారా భారత ప్రాంతాలను నిశితంగా పరిశీలించడానికి వీలవుతుంది. ఈ ఉపగ్రహానికి ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ నిధులు సమకూర్చింది. ఈ ఉపగ్రహం బరువు 2275 కిలోలు. ఈ ఉపగ్రహంలో 6 ఛానల్ ఇమేజర్ ఉంది. 19 ఛానల్ సౌండర్ మెటరాలజీ పేలోడ్స్ ఉన్నాయి. ఈ ఉపగ్రహాలను ఇస్రోతో పాటు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) నిర్వహిస్తోంది. దీని ద్వారా ప్రకృతి వైపరీత్యాలు రాకముందే ప్రజలకు సమాచారం అందించవచ్చు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించవచ్చు. ఈ ఏడాది ఇస్రో ప్రయోగించిన రెండో ఉపగ్రహ ప్రయోగం ఇది. తొలుత దీనిని జనవరిలో లాంచ్ చేయాలని భావించారు. కానీ ఆ తర్వాత రీషెడ్యూల్ చేశారు.

Also Read: ‘న్యూటన్‌ నాగబాబు..’ సైన్స్ పంతులు.. చంద్రబాబుకు చురకలు.. ఆ ట్వీట్ల అర్థం ఇదే!

 

 

 

 


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *