Menu

Prashanth Varma: ప్రశాంత్‌ వర్మది ఓవర్‌ కాన్ఫిడెన్సా? ప్యూర్‌ కాన్ఫిడెన్సా? వాళ్లమైనా పైనుంచి ఊడిపడ్డారా?

Praja Dhwani Desk

అదిపురుష్‌ సినిమాను స్వయానా ప్రభాస్‌ అభిమానులే సోదిపురుష్‌ అని నెత్తి నోరు బాదుకున్నారు. ఈ సంక్రాంతికి విడుదలైన హనుమాన్‌ సినిమా చూసి మా ప్రభాస్‌ సినిమా ఇలా ఎందుకు తియ్యలేదంటూ ఆదిపురుష్‌ డైరెక్టర్‌ ఓం రావత్‌ని నోటికి వచ్చిన తిట్టు తిట్టారు. మరికొంత బాధ పడ్డారు కూడా. అలాంటిది సడన్‌గా హనుమాన్‌ దర్శకుడు ప్రశాంత్‌ వర్మ విషయంలో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ యూ టర్న్‌ తీసుకున్నారు. ప్రశాంత్‌ వర్మకు ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ పెరిగిందంటూ సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తాజాగా సిద్ధార్థ్ కన్నన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్‌ వర్మ చేసిన వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా ఆదిపురుష్‌, రాజమౌళి, పెద్ద హీరోల విషయంలో ప్రశాంత్‌ చేసిన వ్యాఖ్యలు వారి అభిమానులను ట్రిగ్గర్ చేశాయి.

ప్రశాంత్‌ ఏం అన్నాడు?
ప్రశాంత్ వర్మకు మొదటి నుంచి కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ. ప్రపంచస్థాయి సినిమాలు తీస్తానని చెబుతుంటాడు. పరిమిత బడ్జెట్‌లో అతను తీసిన హనుమాన్ సినిమా అద్భుతాలను సృష్టించింది. ఈ మధ్య ప్రశాంత్ బాలీవుడ్‌లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో ఆదిపురుష్ గురించి అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా తానైతే ఆ సినిమాను ఇంకా బాగా తీస్తానన్నాడు ప్రశాంత్ వర్మ. ఓం రౌత్ కొన్ని సీన్లు బాగానే తీశాడని..కొన్ని మాత్రం అస్సలు నచ్చలేదని చెప్పాడు. తానైతే ఇంకా బాగా తీసేవాడినని చెప్పారు. తనకే కాదు ఏ ఫిల్మ్ మేకర్‌కు అయినా అలాగే అనిపిస్తుందంటూ కామెంట్ చేశాడు. దీపిపై ప్రభాస్‌ ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. ఆదిపురుష్‌ సినిమాలోని కొన్ని క్లిప్స్‌ పెట్టి సినిమా అద్భుతమంటూ అతి ప్రదర్శిస్తున్నారు. మొన్నటివరకు పిచ్చిగా తిట్టి సడన్‌గా ఈ ప్రేమ ఏంటో అర్థంకాని దుస్థితి

రాజమౌళి గురించి ఏం అన్నారంటే?
అలాగే రాజమౌళి మీద కూడా కామెంట్స్ చేశాడు ప్రశాంత్ వర్మ. మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరేందుకు రాజమౌళి దగ్గరకు వెళ్ళానని…తనను తీసుకోలేదని చెప్పాడు ప్రశాంత్ వర్మ. టీమ్‌లో ఖాళీ లేదని తిరస్కరించారన్నాడు. దీంతో ఆయన మీద కోపం వచ్చిందని చెప్పుకొచ్చాడు. అలాగే రాజమౌళి భారతం సినిమా తీయకపోతే తాను తీస్తానని చెప్పాడు ప్రశాంత్ వర్మ. దాంతో పాటూ పెద్ద హీరోలతో సినిమాలు చేయనని చెప్పుకొచ్చాడు. పెద్ద హీరోల డేట్ల కోసం రోజుల తరబడి వెయిట్ చేయాలని… అలా చేసి చాలా రోజులు టైమ్ వేస్ట్ కూడా చేసాను. కానీ ఇక మీదట తాను అలా చేయనని…టామ్ క్రూజ్ లాంటి పెద్ద హీరో వచ్చి అడిగినా చేయనని చెప్పాడు. ఇందులో ఎక్కడా కూడా రాజమౌళిని కానీ పెద్ద హీరోలను కానీ తక్కువ చేసి మాట్లాడలేదు ప్రశాంత్‌ వర్మ. అయినా కూడా అతను ఏదో తప్పు చేసినట్టు.. ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ అది ఇది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అతి తక్కువ బడ్జెట్‌తో వందల కోట్ల వసూలు చేసింది హనుమాన్‌. అలాంటి డైరెక్టర్‌కు ఆ మాత్రం కాన్ఫిడెన్స్‌ ఉంటుంది.. అతను ఏమీ రాజమౌళి కంటే తానే పెద్ద డైరెక్టర్‌ని అని చెప్పుకోలేదు. తాను కూడా మంచి సినిమా తీస్తానని మాత్రమే చెప్పుకున్నాడు. ఈ లైన్‌ అర్థం చేసుకుని కాస్త మెచ్యూర్డ్‌ మైండ్‌తో ఆలోచిస్తే ఈ సోషల్‌మీడియా వీరులు ఈ రేంజ్‌లో పోస్టులు పెట్టరు!

 


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *