Menu

TDP-JSP-BJP Alliance: గెలవలేరు.. గెలవనివ్వరు.. జనసేన-టీడీపీ మధ్య బీజేపీ చిచ్చు!


జగన్‌ని ఓడిస్తామంటూ ఒక్కటైన టీడీపీ-జనసేన మధ్య చిచ్చు పెడుతోంది బీజేపీ.


Tri Ten B 2 years ago
చంద్రబాబుపై హరిరామ జోగయ్య చిందులు:

AP Politics: దేశవ్యాప్తంగా ఎలా ఉన్నా ఏపీలో మాత్రం బీజేపీ ఇప్పటికీ పెద్ద జీరోనే. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటి చేసిన బీజేపీ అసలు ఖాతా కూడా తెరవలేదు. ఎమ్మెల్యే సీటు సంగతి అటు ఉంచితే చాలా చోట్ల నోటాతో పోటి పడిందా పార్టీ. ఈ ఎన్నికల్లో మాత్రం జనసేనతో కలిసి బరిలోకి దిగాలని భావిస్తోంది. నాలుగేళ్ల క్రితమే జనసేన-బీజేపీ మధ్య పొద్దు పొడిచింది. అయితే పొత్తులో ఉన్నారనే కానీ ఎప్పుడూ కూడా ఈ రెండు పార్టీలు కలిసి అడుగులు వేసింది లేదు. చాలా విషయాల్లో కాషాయ పార్టీ నాన్చుడు ధోరణి జనసేన అధినేత పవన్‌ కళ్యాన్‌కు విసుగుతెప్పించింది కూడా. అయినా కూడా పవన్‌ ఓపిక పడుతూ వచ్చారు. ఈ మధ్యలో ఏపీ స్కిల్ స్కామ్‌ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. వెంటనే రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు వెళ్లిన పవన్‌ కళ్యాణ్‌ టీడీపీతో కలిసి రానున్న ఎన్నికల్లో పోటి చేస్తామని చెప్పారు. బీజేపీ తమతో కలిసివస్తుందని భావిస్తున్నట్టు చెప్పుకొచ్చారు.


పొత్తులో మొదలైన లుకలుకలు:
చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చి నెలలు గడుస్తోంది. ఇప్పటివరకు పొత్తుపై బీజేపీ క్లారిటీ ఇవ్వలేదు. గతంలో చంద్రబాబు పలుమార్లు ఢిల్లీ వెళ్లి వచ్చినా పెద్దగా ప్రయోజనం కనిపించలేదు. చంద్రబాబుతో కలిసి నడవడం బీజేపీకి ఏ మాత్రం ఇష్టం లేదు. అందుకే దూరంగా ఉంటుంది. పొత్తు గురించి తేల్చకుండా నాన్చుతోంది. ఇటు పవన్‌-చంద్రబాబు నిన్నటిమొన్నటివరకు చట్టాపట్టాలేసుకోని తిరిగారు. తోడు నీడగా ప్రయాణించారు. ఇంతలోనే ఏమైందో తెలియదు కానీ పవన్‌ చంద్రబాబుపై నేరుగా విమర్శలు గుప్పించారు. చంద్రబాబు పొత్తు ధర్మం తప్పారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అరకు నుంచి దొన్నెదొరను, మండపేట నుంచి వేగుళ్ల జోగేశ్వరరావులను టీడీపీ అభ్యర్థులుగా చంద్రబాబు ప్రకటించడాన్ని తప్పుబట్టిన పవన్‌ తాను రెండు సీట్లు ప్రకటించారు. దీంతో పొత్తులో లుకలుకలు మొదలయ్యాయని ప్రజలకు అర్థమైంది.

 

న్యూటన్ నాగబాబు నాయుడు:
ఇంతటితో ఈ గొడవ సమాప్తం అవ్వలేదు. ట్విట్టర్‌ వేదికగా మెగాబ్రదర్‌ నాగబాబు టీడీపీపై పరోక్ష విమర్శలు గుప్పించారు. న్యూటన్‌ నియమాలు చెప్పిన ఆయన.. గుమ్మాడికాయల దొంగలంటూ చంద్రబాబు టీమ్‌కు చురకలంటిచారు. ఇక తాజాగా పిఠాపురంలో జనసేన-టీడీపీ కార్యకర్తలు తన్నుకున్నారు. టీడీపీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేన కార్యకర్తలు.. మీటింగ్‌లపై తమకు కనీస సమాచారం ఇవ్వలేదంటూ చేతికి పని చెప్పారు.

చంద్రబాబుపై హరిరామ జోగయ్య చిందులు:
ఇక ఆ తర్వాత కాపు నేత, మాజీ మంత్రి హరిరామ జోగయ్య సీన్‌లోకి దిగారు. చంద్రబాబు పొత్తు ధర్మాన్ని తుంగలో తొక్కారని ఫైర్ అయ్యారు. జనసేనకు 50కు పైగా ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. పొత్తు ధర్మానికి తూట్లు పొడుస్తూ టీడీపీకి ఎక్కువ సీట్లు వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారని హరిరామ జోగయ్య ఆగ్రహించారు. ఇదంతా చూస్తుంటే పొత్తు పెటకులు అయ్యినట్టుగానే అనిపిస్తోందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. చంద్రబాబుతో కలిసి వెళ్లడం ఇష్టం లేని బీజేపీ జనసేన పిర్ర గిల్లి టీడీపీ మీదకు వదలుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Also Read: ‘న్యూటన్‌ నాగబాబు..’ సైన్స్ పంతులు.. చంద్రబాబుకు చురకలు.. ఆ ట్వీట్ల అర్థం ఇదే!

 


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *