మీలో ఎంతమందికి చిన్ననాటి జ్ఞాపకాలు కళ్ళ ముందు మెదులుతూ ఉంటాయి? ఒకప్పటి 90 లలో పుట్టినోళ్లకైతే ఎన్నెన్ని జ్ఞాపకాలలో కదండీ! మాటల్లో చెప్పలేం ఆరోజులని.
మీ రోజు ఎలా మొదలయింది? అదే నాకైతే ఉదయం కళ్ళు తెరవగానే నాన్న క్యాంపు నుంచి కొని తెచ్చిన సీతాకోక చిలుకల గడియారం నాకు గుడ్ మార్నింగ్ చెప్పేది.టైం 8 అయింది స్కూల్ కి వెళ్ళవా.. లే…లే అంటూ నాన్న అరుపులు….అమ్మో 8 అయిందా అనుకుని హడావుడి పడుతుంటే తీరా బయటకు వచ్చి చూస్తే పక్కింటి అమ్మాయి ఇంకా పళ్ళు తోముతూనే ఉంది ఉంటుంది…ఏంటి నువ్వు కూడా లేటైనా అని అడిగితే లేట్ ఏముంది టైం ఏడే కదా… ఇంకా గంట టైం వుంది అంటేనే అబద్దం చెప్పిన నాన్నను తలచుకుని తిట్టుకునేదాన్ని.

ఇప్పట్లోలాగా మావి కాన్వెంట్ చదువులు కావు…గవర్నమెంటు బడులు…మేము ముగ్గురమూ ఆడపిల్లలు కదా చదివే స్థోమత అప్పటి మధ్యతరగతి వాళ్లకు ఏం సాధ్యం? అయినా ఎక్కడ చదివితే ఏముంది చదువు కదా ముఖ్యం…ఏమో అలా చదివాం కాబట్టే కొద్దో గొప్పో విలువలు తెలిశాయేమో..అయ్యో నేనేం కాన్వెంట్ చదువుల్ని తప్పుబట్టటం లేదండి…కాకపోతే కొన్ని కష్టనష్టాలు పిండి బడిలో చదివితేనే తెలుస్తాయి…పిండి అబ్బా తలచుకుంటే అప్పుడు విసుగేమో కానీ ఇప్పుడైతే భలే ఉండేది అనిపిస్తుంది…ఎందుకా? రోజు మాకు సాయంత్రం పిండి ఇచ్చేవారండి భలే ఉండేది…దానితో అట్లు వేసుకుని తినేవాళ్ళం…చాలా హెల్తీ అట.మాకేం తెలుస్తుంది చిన్నపిల్లలం కదా!

ఇక స్నేహితుల విషయానికొస్తే ఒకరా ఇద్దరు అబ్బో మనకి చాలానే దోస్తులుండేవారు…కోపతాపాలు.. చిలిపి ఆటలు…ఇప్పటి పిల్లలు ఆడే ఆటలు ఒక ఆటలా అండి..కోకో, కబడ్డీ, కోతికొమ్మచ్చి,దొంగాట,గప్ చుప్ ఇలా ఎన్నో ఆటలుండేవి…ఇండోర్ గేమ్స్ అంటే వైకుంఠపాళి, చింత గింజలాట ఆ ఆట ఆడటానికి ఎన్ని గింజలను పోగు చేసుకునే వాళ్ళమో..క్లాసెస్ జరుగుతుండగా SFI వాళ్ళు వచ్చి ఎదో ఒక బంద్ చేశామని బడి మూసేయాలని అన్నప్పుడు మేము పాడుకునే పాట: “మధ్యాహ్నం బడి లేదోయ్ మజ్జిగన్నం తినలేదోయ్” హహ ఏముండేవండి ఆ రోజులు.
పరీక్షల సమయం వస్తే తెలిసేది స్నేహం విలువ…అరేయ్ కొంచెం నాకు చెప్పారా ఇది అర్ధం కావట్లేదు…నువ్వు నాకు ఇది నేర్పించు నేను నీకు ఇది చెప్తా ఇలా పంచుకునే వాళ్ళం…ఇప్పుడు న్యూ ఇయర్ వస్తే ఏం చేస్తారు 31వ నైట్ వాట్సాప్ లో హ్యాపీ న్యూ ఇయర్ మెసేజెస్ కదా! మాకు అలా కాదండీ జనవరి 1వ తేదీ మాకు తెలిసిన నూతన సంవత్సరం. ఆ రోజు కోసం ఎప్పటి నుంచో డబ్బులు దాచుకుని గ్రీటింగ్ కార్డులు కొని పెట్టుకునేవాళ్ళం..తమకు ఇష్టమైన హీరోలవో లేక ఫ్లవర్స్ అని ఫ్రూట్స్ అని ఇలాంటివే….నేనుకొన్న గ్రీటింగ్ కార్డ్స్ ఎవరివో తెలుసా? బేబీ షామిలి, ఇంకా సిసింద్రీ అఖిల్‌వి….
అప్పుడు మేము తిన్న చిరుతిండ్లు పది పైసలు, ఇరవై పైసల రూపంలో వుండే పిప్పెర్మెంట్ బిళ్లలకు దారంకట్టి తయారుచేసిన కైరూ మిఠాయి దానితో ఆడినంత సేపు ఆడుకుని తినేవాళ్ళం.అలాగే ఏబీసీడీ, మరియు అంకెల బిస్కట్స్,ఇప్పుడు మీరు తినే బిస్కెట్స్ ఏం బిస్కెట్స్ అండీ.. 90’s వాళ్ళని అడగాలి అసలు వాటి టేస్ట్. మీరు తినే బూమర్ కాదు ఒకప్పుడు మేము తిన్న బిగ్ బాబు కదా అసలైన బాబులగం అంటే…ఆశా మరియు పాన్ పసందు చాకోలెట్లు, కలర్ కోన్స్,చింతపండు స్టిక్స్….ఇలా ఒకటేమిటి ఎన్నో ఎన్నెన్నో ఉండేవి.

కాలం మా కళ్ళముందే ఎంతో మారింది. మేము చిన్నప్పుడు జ్వరంవస్తే కూల్డ్రింక్ తాగేవాళ్ళం, ఐస్క్రీమ్ తినేవాళ్ళం. మాకు అప్పుడే పండగ. కానీ ఇప్పుడు అవి తాగటం వలన ఆ రోగాలు వస్తున్నాయి.ఒకప్పుడు మాకు ఏ రోగం వచ్చినా.. ఒకరే ఫ్యామిలీ డాక్టర్. కానీ ఇప్పుడు జబ్బుకు ఒక డాక్టర్…ఒకటి తినమని చెప్పే డాక్టర్ ఒకరైతే… అదే తినకూడదని చెప్పే డాక్టర్ ఇంకొకరు. గజిబిజి బిజీ లైఫ్ లో మన పయనం చివరికి ఎటు వైపుకో కాలమే నిర్ణయించాలి.
ఇంకా చదవండి: ప్రశ్నించే హక్కు లేనప్పుడు…అది నీ జీవితమెందుకవుతుంది?

Adenoids: ‘అమ్మా.. నేను మళ్లీ ఊపిరి పీల్చలేకపోతున్నా..’ కూతురి కోసం తల్లి పడిన వేదన! చివరకు ఏం జరిగిందంటే!
Middle Class Dreams: అద్దంలో కనిపించిన కల.. ఇది ఒక మిడిల్ క్లాస్ కథ!
Life Lessons: మిస్ అయిన ట్రైన్… జీవితం నేర్పిన పాఠం! ఆలస్యం కూడా ఆశీర్వాదమేనా?
Relationships: మనల్ని మనమే మరిచిపోయిన కథ.. బతుకుతున్నామా లేదా నటిస్తున్నామా?
Relationship Tips: మీ లైఫ్ పార్ట్నర్తో చెప్పకూడని నాలుగు విషయాలు.. ఇది సిక్రెసీ కాదు ప్రైవసీ!
Pulse Polio: రెండే రెండు చుక్కలు.. మిస్ చేసుకోవద్దు..! చిన్న తప్పు… పెద్ద నష్టం..! ఇది కేవలం వార్త కాదు.. హెచ్చరిక..!