Menu

Shocking News: బాలుడిపై దావానలంలా దాడి చేసిన నాలుగు వైరస్‌లు.. ఐదేళ్లకే నిండిన నూరేళ్లు!

Praja Dhwani Desk

Strep Covid : ఒక చిన్న ఆరోగ్య సమస్య వస్తేనే విలవిలలాడిపోతాం. అది ఎప్పుడు తగ్గుతుందా అని దిగులు చెందుతుంటాం. కాస్త వయసులో ఉన్నవారైతే అనారోగ్యాలను ధైర్యంగా ఎదుర్కొంటారు కానీ.. చిన్నపిల్లలకు చిన్నపాటి జ్వరమొచ్చిన తట్టుకోలేరు. 2020 ప్రారంభంలో కరోనా దెబ్బకు ప్రజలు అల్లాడిపోయారు. అటు పెద్దవాళ్లతో పోల్చితే చిన్నారుల్లో ఈ వైరస్‌ బారినపడ్డ వారి సంఖ్య చాలా తక్కువే అయినా కొంతమందిని మాత్రం ఈ మహమ్మారి మింగేసింది. చికాగోలో కార్లోస్ అనే ఐదేళ్ల బాలుడికి కొన్నాళ్ల క్రితం కరోనా సోకింది. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ రెండు నెలల క్రితం చనిపోయాడు. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా జీన్ మరణించినట్లు చికాగో డిపార్ట్ మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ తొలుత ప్రకటించింది. ఇప్పుడు తాజాగా అతని మరణానికి గల అసలైన కారణాలు బయటపడ్డాయి. ఇది డాక్టర్లను కూడా షాక్‌కు గురిచేసింది.

నాలుగు వైరస్‌లు దాడి:
కార్లోస్ను మరణించిన దాదాపు రెండు నెలల తరువాత విడుదల చేసిన ఒక నివేదిక అతని మరణానికి సెప్సిస్ కారణమని నిర్ధారించింది. స్ట్రెప్-ఎ ఇన్ఫెక్షన్‌తో పాటు కరోనా కూడా అతని మరణానికి కారణం అయ్యాయని రిపోర్ట్ చెబుతోంది. కార్లోస్‌ మృతికి మరో రెండు వైరస్‌లు కారణమని నివేదికలో తేలింది. నిజానికి సెప్సిస్ 24 గంటల్లో తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది.

స్ట్రెప్-ఏ గొంతు నొప్పి, జ్వరం, చర్మ ఇన్ఫెక్షన్లు లాంటి తేలికపాటి అనారోగ్యాలకు కారణమవుతుంది. దీన్ని యాంటీబయాటిక్స్‌తో త్వరగా చికిత్స చేయవచ్చు. అయినప్పటికీ.. అరుదైన సందర్భాల్లో బ్యాక్టీరియా ఊపిరితిత్తులు లేదా రక్తప్రవాహంలోకి ప్రవేశిస్తే ఇన్వాసివ్ గ్రూప్ స్ట్రెప్-ఏ సంక్రమణను ప్రేరేపిస్తుంది. ఈ అంటువ్యాధి ప్రాణాంతకం.

Also Read: దంగల్ ఫేమ్ సుహానీ మృతికి కారణమైన ఈ వ్యాధి గురించి తప్పక తెలుసుకోండి!

 

 

 


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *