Menu

Ram Mandir: ఎవరి కల..? ఎవరికి కల..? ఎప్పుడు కన్నారీ కల?


కలాంగారు కలలు కనమన్నారు.. కథలు పడమనలేదు.. ఈ విషయాన్ని అందరూ ఎంత బాగా అర్థం చేసుకుంటే అంతమంచిది!


Tri Ten B
PM Modi in his historic speech says : "Ram Mandir is built, Now What Next? I have a feeling that kaal chakra is changing. This is the right time. We have to now lay the foundation of India for the next 1,000 years"

పట్టుమని పదహారేళ్లు కూడా లేనోడు రాంమందిరం గురించి వాట్సాప్‌ల్లో అదేపనిగా స్టేటస్‌లు పెడుతున్నాడు. ఫేస్‌బుక్‌ ఓపెన్‌ చేస్తే అంతా రామమయమే. తప్పేలేదు.. ఎందుకంటే అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కొన్నేళ్ల ముందు వరకు ఎవరూ ఊహించనది. రాజకీయపరంగా, మతపరంగా రాంమందిర అంశం దశాబ్దాలుగా లెక్కలేనన్ని సార్లు చర్చకు వచ్చింది. ఎన్నికలనూ ప్రభావితం చేసింది. 1992 బాబ్రీ మసీద్‌ కూల్చివేత తర్వాత బీజేపీ దశా దిశా మారిందని చెప్పడంలో ఎలాంటి సందేహంలేదు.. అప్పటినుంచి ఇప్పటివరకు ఎన్నికల సమయంలో రాంమందిర నిర్మాణమే ప్రచార ఎజెండాగా బీజేపీ బరిలోకి దిగింది. రాజకీయంగా ఇంతటి ప్రాధాన్యమున్న ఈ గుడి నిర్మాణం గురించి పెద్ద ఎత్తున చర్చ జరగడంలో ఎలాంటి తప్పూలేదు. అయితే అసలు ఈ ఆలయ చరిత్ర లేదా దాని చుట్టూ జరిగిన హింసాకాండ గురించి కానీ.. జరిగిన అల్లర్లు గురించి కానీ ఎలాంటి అవగాహన లేని.. కనీస జ్ఙానం లేని టీనేజ్‌ పిల్లలు సైతం జై శ్రీరామ్‌ అంటూ నినాదాలు చేస్తుండడం, పక్కనోడు ఏదో పోస్టు పెట్టాడు కదా మనం కూడా అదే పెడదాం అని గొర్రెల మాదిరి బీహెవ్‌ చేయడం విడ్డూరం!

అయోధ్య రాంమందిర నిర్మాణం హిందుల కల అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ప్రధాని గారు ఒక అడుగు ముందుకేసి మందిర నిర్మాణం కోట్లాది మంది భారతీయుల కల అని తేల్చేశారు. ఆయన రాజకీయ కలలు భారతీయ కలలు ఎందుకు అవుతాయో తెలియని దుస్థితి. ప్రధాని కదా అని దేశాన్ని ఆయన కళ్లతోనే చూడాలేమో మరి.. లేకపోతే ఓ మతానికి సంబంధించిన గుడి నిర్మాణం, విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ఎన్నో మతాలకు నిలయమైన భారత్‌ మొత్తానికి ఆపాదించడం వెనుక ఉద్దేశం ఏంటి?

రాజకీయనాయకులు ఓట్ల కోసం ఏమైనా మాట్లాడుతారు.. వారికి ఆ స్వేచ్ఛ ఉంది..! మరి ప్రజల సంగతేంటి..? రాంమందిర నిర్మాణం నా కల అని ఒకరిని చూసి ఇంకోకరు భావించడమేంటి? కలలు సొంతంగా ఉంటాయి కదా.. పక్కనోడి కల మన కల ఒక్కటే అవ్వడంలో ఆశ్చర్యమేమీ లేదు కానీ ఓ రాజకీయ పార్టీ కలనే తమ కలగా భావించుకుంటే అది ముర్ఖత్వమో.. గొర్రెతనయో.. తెలివితక్కువతనమో అవుతుంది. నిజానికి దక్షిణాదిన మందిర రాజకీయాలు వర్కౌటైన దాఖలాలు లేవు. హిందుత్వ రాజకీయాలు కాస్తో కూస్తో చెల్లుబాటు అయ్యే కర్ణాటకలోనూ అయోధ్య రాంమందిర నిర్మాణం ఎప్పుడూ ప్రధాన అంశంకాదు.. వారి కల అంతకన్నా కాదు. ఉత్తరాదిన కొన్ని రాష్ట్రాలకు, కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితమైన ఈ అంశాన్ని యావత్‌ దేశంలోని హిందువుల కలగా చూపించడంలో బీజేపీ పీఆర్‌ అద్భుతంగా పని చేసిందనే చెప్పాలి. ముఖ్యంగా సోషల్‌మీడియాలో బీజేపీని ఈ విషయంలో కొట్టేవాడే లేడు. బీజేపీ మార్కెటింగ్‌ ఎంత బాగా పని చేస్తుందంటే వారి కలలనే ప్రజలందరి కలగా అందరూ భావించే అంతలా.

Also Read: అవునులే మనకి సైన్స్‌ ఎందుకు.. వాట్సాప్‌ యూనివర్శిటీ చాలు.. సూడో పాలకులతో అంతే!

 

 


Written By

1 Comment

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *